పవన్ కొడుకు జాతకం ఎంత గొప్పగా వుందో తెలుసా ?

swamiji-says-for-pawan-kalyan-and-anna-lejina-son-astrology

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సామాన్యుల జాతకం చెబితే డబ్బులు వస్తాయి. అదే సెలెబ్రెటీల జాతకం చెబితే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. టాపిక్ నాలుగు నోళ్ళలో నానితే అదే తరువాత పెద్ద పెట్టుబడి అవుతుంది. ఇదే ఫార్ములాతో చాలా మంది జ్యోతిష్కులు వ్యవహరిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వచ్చాక తాము చెబుతున్న విషయం జనం దగ్గరికి తీసుకెళ్లడం కూడా సులభం అయిపోయింది. ఇది చూసుకునే ఈ మధ్య వేణు స్వామి అనే జోస్యుడు రెచ్చిపోయి ఎడాపెడా అన్ని విషయాల మీద తన అంచనాలు చెప్పేసాడు. నంద్యాల ఎన్నికలు , బిగ్ బాస్ విజేత వంటి వాటిలో అయ్యగారి అంచనాలు బొక్కబోర్లా పడడంతో సార్ కొంచెం స్లో అయ్యారు. వేణుస్వామి స్లో కావడంతో ఇంకో స్వామి ముందుకు వచ్చారు. ఆయన తన వూరు, పేరు చెప్పకుండా సోషల్ మీడియా లో పవన్ కి పుట్టిన కొడుకు జాతకం ఎలా ఉండబోతోందో చెప్పాడు.

ఆ జోస్యుడు చెప్పినదాని ప్రకారం పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులకి 2017 , అక్టోబర్ 10 న హైదరాబాద్ లో ఉదయం 10 : 32 నిమిషాలకి కొడుకు పుట్టాడు. అతని జన్మ నక్షత్రం రోహిణి నాలుగో పాదమట. వృషభ రాశి, వృశ్చిక లగ్నం. వృషభంలో చంద్రుడు, కర్కాటకంలో రాహువు ఉన్నారంట. ఈ జాతకం ప్రకారం ఈ అబ్బాయి ఆయుష్షు బాగా ఉండటమే కాదు. లోతైన ఆలోచనలు కలిగి ఉంటాడట. గొప్ప తెలివితేటలతో పాటు తత్వ, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా వుండే అవకాశం వుంటుందట. ఇక పేరెంట్స్ విషయానికి వస్తే తల్లి మాట పెద్దగా పట్టించుకోకున్నా తండ్రిని బాగా గౌరవిస్తాడంట.

ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చెల్ చేస్తున్న కుమారుడి జాతకం చూసి పవన్ కూడా సంతోషంతో పొంగిపోతున్నారని సదరు జోస్యుడు చెప్పుకుంటున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మిక , తత్వ కోణం ఉందని అందరు చెప్పుకుంటారు. కానీ ఆయన ఈ జాతకాలు వంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. అది తెలిసి కూడా పవన్ ని చూపిస్తూ వ్యాపారం పెంచుకోడానికి ఆ జోస్యుడు ప్రయత్నించడం చూస్తుంటే నవ్వు వస్తోంది.