Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. రాజకీయ దిగ్గజాలు అనుకున్నవాళ్ళు తెర వెనక్కి వెళుతుంటే నిన్నమొన్నటిదాకా ఊరుపేరు లేని వాళ్ళు వెలిగిపోతున్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి. ఈ ఇద్దరూ ఇంతకుముందు బీజేపీ లో కొద్ది మనుషులే. ఇక బీజేపీ అంటే అద్వానీ, అద్వానీ అంటే బీజేపీ అనుకుంటే ఆయనే పార్టీ లో అనాధ అయిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ ఓ బ్రాండ్ క్రియేట్ చేసాక రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని కొందరు స్వాముల్లో అభిప్రాయం ఏర్పడిందట.
రాజకీయాల్లో స్వామీజీలకు ఆసక్తి ఉండటం సహజమే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే వాతావరణం వుంది. ఏదో ఒక ఆధ్యాత్మిక సంబంధమైన విషయాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పని తీరుని స్వామీజీలు తప్పుపట్టడం ఎన్నో సార్లు చూసాం. చినజీయర్ స్వామి, స్వరూపానంద లాంటి వాళ్ళు ఈ విషయంలో ముందుంటున్నారు. ఇక గత కొన్నేళ్లుగా పరిపూర్ణానంద స్వామి కూడా మీడియాలో బాగా యాక్టివ్ గా వుంటున్నారు. హిందూ ధర్మం మీద ఏ చిన్న ఆరోపణ వచ్చినా ఆయన ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సొంతంగా భారత్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి హిందూ ధర్మం అన్న విషయం లేకుండా ప్రొఫెసర్ ఐలయ్య రాసిన ఓ పుస్తకం మీద పరిపూర్ణానంద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓ కులాన్ని తప్పుబట్టడం తగదని ఐలయ్య మీద ధ్వజమెత్తారు . ఆయన దూకుడు చూసిన వామపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అయితే ఏకంగా స్వామి పరిపూర్ణానంద ఆంధ్ర ప్రదేశ్ కి సీఎం కావాలి అనుకుంటున్నారని ఆరోపించారు. ఆ టైం లోనే యూపీ సీఎం యోగి ప్రస్తావన తెచ్చారు.