హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు ఎక్కవైపోతున్నారు. కరోనా.. లాక్ డౌన్ కాలాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఓ యువకుడి బ్యాంక్ అకౌంట్‌లో నుంచి రూ.11.30 లక్షలు మాయమైన ఘటన హైదరాబాద్‌లో తాజాగా కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కిషోర్ హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడి సెల్‌ఫోన్ ఉన్నట్టుండి స్విచ్ఛాఫ్ అయిపోయింది. దాదాపు అరగంట వరకు ఫోన్ ఆన్ కాలేదు. ఆ తర్వాత ఫోన్ ఆన్ చేసి చూస్తే అందులో నుంచి చాలా యాప్‌లు డిలీట్ అయ్యాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ఉపయోగించే ‘యూనో’ యాప్ కూడా డిలీట్ అయిపోయింది.