సైరా సినిమాకి యునానిమస్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ అయ్యింది. అలాగే చాలా చోట్ల అవుట్ రేట్‌కే కాకుండా నాన్ రిటర్నబుల్ అడ్వాన్సులకి కూడా ఈ సినిమాని ఇచ్చారు. దాంతో ఈ సినిమా ఎక్కడ ఎంత రాబట్టింది అనేది లెక్కగట్టడం మాత్రం కాస్త కష్టం అవుతుంది. అయితే ముందు రఫ్ గా 50 కోట్ల కలెక్షన్స్ అని లెక్కతేలింది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం షేర్ 50 కోట్ల పై మాట అన్నట్టు ఉంది పరిస్థితి.
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 37.60 కోట్లు షేర్ రాబట్టింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత షేర్ అంటే ఇంకా మిగిలిన చోట్ల ఎంత తక్కువ కలెక్షన్స్ వేసుకున్నా కూడా 15 కోట్ల షేర్ అనేది మాత్రం గ్యారంటీ. అంటే మొదటిరోజు షేర్ వాల్యూ గానే 50 కోట్లు రాబట్టాడంటే బాస్ స్టామినా ఏంటి అనేది అర్ధమవుతుంది. పైగా ఇది మిడ్ వీకెండ్ రిలీజ్ కాబట్టి ఈ రోజు కాస్త కలెక్షన్స్ తగ్గడం అనేది కామన్. కానీ మళ్ళీ ఫస్ట్ షోల నుండి కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ అనేవి కామన్. మల్టీప్లెక్స్ బుకింగ్స్ అయితే ఆదివారం వరకు ఆల్మోస్ట్ ఫుల్ అని చూపిస్తున్నాయి. సీట్స్ మిగిలినా కూడా ఒక 10 పెర్సెంట్ మాత్రమే ఉన్నాయి. అంటే రేపటినుండి కూడా ఈ సినిమా కలెక్షన్స్ మరింత ఊపందుకోనున్నాయి.
ప్రస్తుతానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే బాహుబలిని దాటి బాహుబలి-2 తరువాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సో, ఈ వారాంతానికి వచ్చే కలెక్షన్స్‌తో సైరా సేఫ్ జోన్ లోకి వచ్చేసేలా కనిపిస్తుంది. మధ్యలో చాణక్య రిలీజ్ అవుతున్నా కూడా దీనివల్ల అది ఎఫెక్ట్ అవ్వాల్సిందేకానీ దానివల్ల ఇది ఎఫెక్ట్ కాదు. అందుకే బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ బాస్ బొమ్మ కొనుకున్నవాళ్లందరికి కూడా ప్రాఫిట్స్ అందించడం కూడా ఫిక్స్. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాని షేర్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకోవడం వల్ల నిర్మాతలకు కూడా కాసులపంట ఖాయం.