టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

టీ20 వరల్డ్‌ కప్‌ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. టీ20 వరల్డ్‌క ప్‌ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్నది. క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ముగిశాయి. దీని వల్ల టీ20 వరల్డ్‌ కప్ షెడ్యూల్‌ ఐసీసీ విడుదల చేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో మొత్తం 16దేశాలు పాల్గొనబోతున్నాయి. అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్‌ జరగబోతుంది.

నమీబియా, స్కాట్లాండ్‌, పపువాన్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌, నెదర్లాండ్స్‌ వంటి చిన్న జట్లు క్వాలిఫయిర్ టోర్నీలో అర్హత సాధించాయి. అర్హత సాధించిన చిన్న జట్లను గ్రూప్ ఏ, గ్రూప్ బీ అనే రెండు గ్రూపులుగా విభజించడం జరిగినది. టాప్లో ఉన్న పది జట్లలో ఉన్న రెండు పెద్ద జట్లను కూడా ఐసీసీ రెండు గ్రూపుల్లో చేర్చింది.

గ్రూప్‌ ఏలో పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ శ్రీలంకతో జట్లు ఉన్నాయి. గ్రూప్‌ బీలో నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో మొదట నిలిచే ఏరెండు జట్లు అయిన సూపర్‌12కు అర్హత పొందుతాయి.

సూపర్‌12కు అర్హతసాదించిన జట్లను గ్రూప్‌1, గ్రూప్‌2గా విభజించనున్నారు.భారత్ మొదటి మ్యాచ్​ను సౌతాఫ్రికాతో ఆడనుండగా సూపర్‌12లో భారత్‌ మొత్తం ఐదు మ్యాచుల్లో ఆడనుంది. గ్రూప్‌ ఏలో మొదటి స్థానం లో గ్రూప్‌ బిలో రెండవ స్థానం లో నిలిచే  జట్టులు సూపర్‌ 12లో గ్రూప్‌ 1లో చేరుకుంటాయి. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ గ్రూప్‌ 1లో ఉంటాయి. గ్రూప్‌ బిలో మొదటి స్థానం లో నిలిచిన జట్టు, గ్రూప్‌ ఏలో రెండవ స్థానంలో నిలిచిన జట్టులు సూపర్‌ 12లో గ్రూప్‌ 2లో చేరుకుంటాయి. భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ గ్రూప్‌ 2లో  ఉంటాయి.