విదేశాంగ మంత్రిగా ట‌బు

Tabu Acting As For Foreign Minister In Uzma Ahmad Biopic Movie

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

బాలీవుడ్ లో బ‌యోపిక్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది.  వాస్త‌వ జీవితాలు, వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీస్తున్న క‌థ‌ల‌కు ఇటీవ‌ల హిందీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో నిర్మాతలు, ద‌ర్శ‌కులు అలాంటి సినిమాలు తీసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా…ద‌ర్శ‌కుడు ధీర‌జ్ కుమార్ కూడా ఓ బ‌యోపిక్ కు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఉజ్మా అహ్మ‌ద్ అనే ముస్లిం మ‌హిళ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.  . ఉజ్మా అహ్మ‌ద్ ను పాకిస్థాన్ కు చెందిన తాహిర్ అనే వ్య‌క్తి  బెదిరించి బ‌ల‌వంతంగా వివాహం చేసుకుని పాకిస్థాన్ తీసుకు వెళ్లాడు. అక్క‌డ తీవ్ర ఇక్క‌ట్ల‌కు గుర‌వుతున్న ఉజ్మాను తిరిగి భార‌త్ ర‌ప్పించ‌టానికి కుటుంబ స‌భ్యులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఎంత‌గానో సాయ‌ప‌డ్డారు.

ఇప్పుడు ఉజ్మా జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించాల‌ని ధీర‌జ్ కుమార్ భావిస్తున్నారు. ఆమె పాత్ర‌లో ప‌రిణీతి చోప్రా న‌టించ‌నున్నారు. ఇక ఉజ్మా భార‌త్ కు తిరిగి రావ‌టంలో సాయం చేసిన సుష్మా స్వ‌రాజ్ పాత్రలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు న‌టిస్తోంది . ఇటీవ‌ల సినిమాలు త‌క్కువ‌గా చేస్తున్న ట‌బు ..కీల‌క‌పాత్ర కావ‌టంతో ఈ సినిమాను అంగీక‌రించింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. సుష్మాస్వ‌రాజ్ క్యారెక్ట‌ర్ కు ట‌బు అయితే స‌రైన న్యాయం చేస్తుంద‌ని ధీరజ్ కుమార్ భావిస్తున్నారు. ఇక భార‌త డిప్యూటీ క‌మిష‌న‌ర్ జె.పి. సింగ్ పాత్ర‌ను అనిల్ కుమార్ పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ మొద‌లు కానుంది.

మరిన్ని వార్తలు:

ఆ సెక్స్‌ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!

చిన్నారుల‌కు ప్రేమ‌`తో నేర్పిద్దాం…కోపంతో కాదు