నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ “సరిపోదా శనివారం”. మరి ఒక క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య సాలిడ్ రోల్ చేస్తుండగా ఈ మూవీ పై మంచి బజ్ ఆల్రెడీ అయితే ఉన్నది . ఇక ఎప్పటికప్పుడు మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ను అందిస్తుండగా ఇపుడు ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 29 నుంచి కేవలం కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్టుగా టాక్. దీనితో ఈ మూవీ ఈ సెప్టెంబర్ రెండో వారానికి మారినట్టుగా టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇంకా వేచి చూడాలి. ఇక ఈ మూవీ కి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.