ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఆస్పత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా పాప ఆకలితో ఏడ్చింది. దీంతో ఆమె ప్రయాణంలో పాపకు పాలు పడుతోంది. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి కింద పడిపడింది. వెంటనే వారిని అసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి బిడ్డకు పాలిచ్చే లోపే మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి పాలు కావాలంటూ ఏడ్చే దృశ్యాలు అందరినీ కంట నీరు తెప్పిస్తున్నాయి.
అయితే ఈ ఘటన అంబాజీపేట మండలంలోని గంగలకుర్రు మలుపు సమీపంలో జరిగింది. అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన పి.వరలక్ష్మి తన రెండేళ్ల పాపతో కలిసి భర్త బైక్పై పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్య లంకకు బయలుదేరారు. గంగలకుర్రు మలుపు వద్దకు వచ్చేసరికి పాప పాల కోసం ఏడ్చింది. దీంతో వెంటనే వరలక్ష్మి పాలు పట్టేందుకు రెడీ అయింది. భర్త బైక్ నడుపుతుండగా..
ఆమె పాపకు పాలు పట్టింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి అందరూ కింద పడిపోయారు. దీంతో స్థానికులు వెంటనే 108కి కాల్ చేశారు. కాసేపటికే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని 108 వాహనంలో ఎక్కించుకొని అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వరలక్ష్మి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగ ఆమె భర్తకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి చనిపోయిందని కూడా తెలియని పాప ఆకలితో ఏడుస్తున్న తీరు అక్కడివారిని గుండెలు అవిశేలా చేస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.