మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన తమిళ అభిమానులు

మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన తమిళ అభిమానులు

ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ కు చెందిన అందరి హీరోల తాలూకా అభిమానులు ఒక్కటయ్యారు. మాములుగా అంటే వారి అభిమానుల హీరోల మధ్య వారిలో వాళ్ళు ఫ్యానిజం పేరిట ఫ్యాన్ వార్స్ ఒక రేంజ్ లో చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.మన హీరోలు కాబట్టి మన వాళ్ళు ఏమనుకున్నా ఓకే కానీ బయట నుంచి ఎవరన్నా వచ్చి మన వాళ్ళను ట్రోల్ చేస్తే ఊరుకుంటారా? అందరూ ఏకమయ్యి వడ్డీతో తిరిగి ఇచ్చేస్తారు.

ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ లేపుతుంది.ఇలాంటి ఫ్యాన్స్ గొడవలకు దూరంగా ఉండే విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాయే ఇప్పుడు సోషల్ మీడియాలో చెలరేగుతున్న ఫ్యాన్ వార్స్ కు కారణం అంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం.ఇటీవలే తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన “అసురన్” చిత్రం అక్కడ పెద్ద హిట్టయ్యింది.దీనితో ఈ సినిమా రీమేక్ లో వెంకటేష్ నటిస్తుండగా ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా కొన్ని వెంకటేష్ పోస్టర్ లు టైటిల్ “నారప్ప” గా పరిచయం చేస్తూ విడుదల చేసారు.

దీనితో కోలీవుడ్ ఆడియన్స్ మొదలుపెట్టారు.ధనుష్ పోస్టర్ కు ఈ పోస్టర్ కు పోలిక పెడుతూ “రియల్ అసురన్ ధనుష్” అంటూ మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడ్డం మొదలు పెట్టగా అక్కడ నుంచి ఇక రెండు ఇండస్ట్రీలలో ఉన్నటువంటి హీరోల సినిమాల పోస్టర్స్ మరియు ఇతర ఫొటోలతో “ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ” అంటూ ఒకరి మీద ఒకరు దారుణమైన ట్రోల్స్ చేసుకుంటున్నారు.మరి ఇది ఎప్పటికి ఆగుతుందో చూడాలి.