బాహుబలి రికార్డులను కొల్లగొడుతున్న “అల వైకుంఠపురములో”

బాహుబలి రికార్డులను కొల్లగొడుతున్న “అల వైకుంఠపురములో”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలను మించి ఒక్క తన కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు బన్నీల కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం అంచనాలను మించిన విజయాన్ని అందుకున్నారు.ఇప్పటికే వసూళ్ల విషయంలో గట్టి పోటీ ఉన్నా సరే నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతూనే ఉంది ఈ చిత్రం.

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.అయితే ఈ ఒక్క సినిమాతో బన్నీపై ఉన్న అనేక మరకలను వారి అభిమానులు ఎదుర్కొన్న ట్రోల్స్ ను ఈ ఒక్క చిత్రంతో తుడిపేసి బన్నీ ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేసారు.ఇంతకు మునుపు వరకు డే 1 రికార్డ్ లేదు ఒక ఇండస్ట్రీ హిట్ లేదు అని అన్న వాళ్లకి డే 1 రికార్డు విషయంలో ఏమో కానీ ఇండస్ట్రీ హిట్ విషయంలో మాత్రం అందరి నోర్లు మూయించేశారని చెప్పాలి.ఇన్నాళ్లుగా ఎదుర్కొంటు వస్తున్న ట్రోల్స్ అన్నిటిని ఒక్క దెబ్బతో కొడితే ఎలా ఉంటుందో బన్నీ “అల వైకుంఠపురములో” చిత్రంతో చూపించారు.