తమిళనాడు స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో డీఎంకే కూటమి 19 కార్పొరేషన్లలో ఆధిక్యంలో ఉంది. మొత్తం 21 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగగా ప్రతిపక్ష అన్నాడీఎంకే కేవలం ఒక్క కార్పొరేషన్‌లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరోవైపు 138 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ 109 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా అన్నాడీఎంకే కేవలం 9 స్థానాల్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా 439 పట్టణ పంచాయతీలకు గాను డీఎంకే 268 స్థానాల్లో ఆధిక్యంతో ఉంది. అన్నాడీఎంకే 22 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని అందుకోనున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యక్తరలు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని డీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద బాణా సంచా కాల్చి వేడుకలు జరుపుకుంటున్నారు.