తమిళ సినీపరిశ్రమలోని ప్రముఖ గాయకుడు కేఎల్ రాఘవన్ మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో వరుసగా వరుస విషాద ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్తను మరవకముందే ప్రముఖ మలయాళ దర్శకుడు, రచయిత సాచి కన్నుమూశాడు. అలాగే.. ఇప్పుడు ఆయన మరణవార్త విని రెండు రోజులు కూడా గడవకముందే ప్రముఖ తమిళ గాయకుడు ఏఎల్ రాఘవన్(87) తుది శ్వాస విడిచారు.
అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. రాఘవన్ మృతి పట్ల సినీవర్గాలు విచారం వ్యక్తం చేశాయి. 1950లో తమిళ సినిమా ‘కృష్ణ విజయం’తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాఘవన్ ఎన్నో గొప్ప సినిమాలకు పాటలు పాడారు. ప్రముఖ సింగర్స్.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జిక్కి, పి.లీలతోనూ కలిసి ఈయన చాలా పాటలు పాడారు. అంతే కాకుండా ఈయన తెలుగులో ఎన్టీరామారావ్ నటించిన ‘నిండు మనసులు’, ‘నేనే మెనగాణ్ణి’ సినిమాల్లో కూడా పాటలు పాడి శ్రోతలను అలరించారు.