“తండేల్ రిలీజ్.. అభిమానుల కోరికలు తీరుతాయా?”

"Tandel release.. Will fans' wishes be fulfilled?"
"Tandel release.. Will fans' wishes be fulfilled?"

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్” కోసం తెలిసిందే. మరి వీరి కలయికలో ఇది రెండో మూవీ కావడం పైగా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ మూవీ కావడంతో దీనిపై గట్టి అంచనాలు నెలకొన్నాయి .

అయితే ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ విడుదల దాదాపు డిసెంబర్ లోనే అన్నట్టుగా ఇప్పుడు టాక్ ఉంది కానీ మరో పక్క సంక్రాంతి రేస్ కూడా అన్నట్టు గా వినిపిస్తుంది. అయితే లేటెస్ట్ గా మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీ ని దాదాపు సంక్రాంతి బరిలోకే కోరుకుంటున్నారు.

"Tandel release.. Will fans' wishes be fulfilled?"
“Tandel release.. Will fans’ wishes be fulfilled?”

అక్కినేని కుటుంబంకి ఈ మధ్య సంక్రాంతి సీజన్ బాగా కలిసి రావడంతో వారు తండేల్ ను ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి కోరుకుంటున్నారు. మరి ఇది తీరుతుందో లేదో ఒక అధికారిక క్లారిటీ రిలీజ్ పోస్టర్ తో వస్తే సరిపోతుంది. మరి ఈ మూవీ ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.