Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో చాలా సంవత్సరాల క్రితమే ఎంట్రీ ఇచ్చిన తాప్సి అనుకున్న స్థాయిలో గుర్తింపును దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. ఆ కారణంగానే బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్లో మెల్ల మెల్లగా హీరోయిన్గా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా ‘ఆనందో బ్రహ్మా’ చిత్రంతో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కొంత గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని చేసిన తాప్సి పారితోషికంగా ఇస్తామన్న 75 లక్షలను తిరష్కరించిందట. నిర్మాతల నుండి పారితోషికం కాకుండా లాభాల్లో షేర్ కావాలని మెలిక పెట్టింది. అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పారు. సినిమా సక్సెస్ అయితేనే ఆమెకు పారితోషికం అంటూ ఒప్పందం చేసుకున్నారు.
ఇటీవలే విడుదలైన ఆనందో బ్రహ్మా సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి వారం రోజులు మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇటీవల అర్జున్ రెడ్డి రావడంతో కాస్త కలెక్షన్స్ తగ్గాయి. అయినా కూడా మొత్తంగా లాభదాయకంగానే ఆనందో బ్రహ్మా సినిమా ముగిసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటా కావాలని కోరడం వల్ల తాప్సి ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికంను అందుకున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. హీరోలు మాత్రమే ఇలా లాభాల్లో షేర్ తీసుకుంటారు. తాప్సి తనకున్న క్రేజ్‌తో ఇలా లాభాల్లో వాటా కోరి తెలివైన నిర్ణయం తీసుకుందని సినీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వార్తలు: