తెలుగు సినీ ప్రేక్షకులకు మరియు సినీ వర్గాల వారికి తారా చౌదరి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కొన్నాళ్ల క్రితం ఈమె రాజకీయ నాయకులు మరియు సినీ తారలపై చేసిన విమర్శలు ఏ స్థాయిలో వివాదాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చిన తారా చౌదరి తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఇక కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. తారా చౌదరి తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు రాజశేఖర్‌కు మద్య ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చేసింది. మీడియాలో వచ్చిన వార్తలు పుకార్లే అంటూ తేల్చి చెప్పింది.
హీరో రాజశేఖర్ గారు అంటే తనకు అభిమానం అని, ఆయన్ను జీవితంలో రెండు మూడు సార్లు మాత్రమే కలిశాను అని, ఒకసారి తాను ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్ పక్క ప్లాట్ చూసేందుకు వచ్చారని, ఆ సమయంలోనే ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు షూటింగ్ సమయంలో కలిశారు. అంతకు మించి ఆయనతో పెద్దగా పరిచయం లేదని, ఆయనంటే నాకు అభిమానం అంటూ తారా చౌదరి చెప్పుకొచ్చింది. మీడియాలో మా ఇద్దరి గురించి వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అసలు ఆయనంటే నాకు గౌరవం అని, కొందరు నా జీవితాన్ని నాశనం చేసేందుకు చూశారు, మీడియాలో నా గురించి తప్పుడు కథనాలు వచ్చాయి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.