ఉద్యోగాలను తీసివేసే పనిలో టాటాస్టీల్‌ 

ఉద్యోగాలను తీసివేసే పనిలో టాటాస్టీల్‌ 

ప్రపంచ వ్యాప్తంగా 27.5 మిలియన్ టన్నుల ముడి ఉక్కు డెలివరీలతో అగ్రశ్రేణి ఉక్కు ఉత్పత్తి చేసే సంస్థలలో టాటాస్టీల్‌  ఒకటి. సెయిల్ తరువాత 13 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉక్కు సంస్థ. టాటా స్టీల్ భారతదేశం, నెదర్లాండ్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో కీలక కార్యకలాపాలతో 26 దేశాలలో పనిచేస్తుంది మరియు సుమారు 80,500 మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల యొక్క 2014 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో 486 వ స్థానంలో ఉంది.

కానీ ఈ ఉక్కు దిగ్గజం కూడా ఉద్యోగాలను తీసివేసే పనిలో పడింది. ఖర్చులను తగ్గించే ప్రణాళికల్లో ఇంకా సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించనుంది. యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెన్రిక్ఆడమ్‌ ఒక​ ఇంటర్వ్యూలో టాటా యూరోపియన్ వ్యాపారంలో ఉద్యోగ కోతలను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. మార్కెట్‌ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని సుమారు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలకు తీసివేసే పనిలో ఉంది.

భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు ఐరోపాలో ఉక్కు తయారీలో అంతర్జాతీయంగా పోటీ ఇంకా అధిక ఇంధన వ్యయాల ఒత్తిడి నేపథ్యంలో కోతలో ఎక్కువ వైట్ కాలర్ ఉద్యోగస్తులు ఉంటారని సమాచారం. ఇరవై వెలకి పైగా యూరోపియన్ వ్యాపారంలో పనిచేస్తున్నారు.