కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైనా కన్నేసింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానావిధాలుగా రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తుంది . పంటల సాగుకు అందజేసే నీటిపైనా పన్నులు విధించేందుకు సమాయత్తం అవుతున్నది. పంట రకాలు ,సాగునీటి విధానాల బట్టి పన్ను వసూలు చేయాలని కసరత్తు చేస్తున్నది.
అందులో భాగంగా అన్ని రాష్ర్టాలతో ఇటీవల ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించింది. ‘భారతదేశంలోని ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టుల నీటి చార్జీలు, భౌతిక, ఆర్థిక అంశాల స్థిరీకరణకు అనుసరించాల్సిన పద్ధతులు’ పేరిట ప్రత్యేకంగా వర్‌షాప్‌ను నిర్వహించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ర్టాలు సాగునీటికి విధిస్తున్న పన్నులపై చర్చించింది. త్వరలోనే అన్నింటిని కలిపి ఏకరీతిలో చార్జీలను విధించే విధానాన్ని తీసుకురావాలని రాష్ర్టా కుట్రలకు తెరలేపింది. అయితే సమావేశంలో సాగునీటిపై పన్నులను విధించడాన్నితెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
ఇంతకుముందు కూడా, తెలంగాణలో యాసంగి పంటను కొనమంటే కొనమని మొండికేసింది. అవసరమైతే తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అవహేళన చేసింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆందోళన చేసినా కేంద్ర సర్కారు కనికరించలేదు. దీంతో చేసేదేమీలేక రైతుల ధాన్యాన్ని తెలంగాణ సర్కారే కొనుగోలు జేసింది. అయితే, ఏడాదిన్నరకే కేంద్ సర్కారు నాలుక మడతేసింది. దేశంలో బియ్యం కొరత ఏర్పడిందని పేర్కొంటున్నది. నాడు పారాబాయిల్డ్ ఫుల్లుగా ఉన్నాయన్న మోదీ సర్కారు..
నేడు అవే బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. కేంద్ర సర్కారు ఆనాలోచిత , అసమర్థ నిర్ణయాల వల్ల భారత్ ప్రపంచ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్నప్పటికీ ,ఇప్పుడు అన్నిరకాల బియ్యంపై ఆంక్షలు విధించాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రాలు అన్నదాతల దృష్టిని వరినుంచి ఇతర పంటలకు మళ్లించాలని నాటి కేంద్రం సూచనలిస్తుంది. దీంతో దేశంలో ధాన్యం కొరత ఏర్పడింది. అలాగే, కేంద్రం నిర్ణయం అన్నదాతలకూ శాపంగా మారింది. ధాన్యం బదులు ఇతరత్రా చిరుపంటలు పండించి, రైతులు నష్టాలబాటపట్టారు. కేంద్రం ముందుచూపులేమితో అటు అంతర్జాతీయంగా దేశం పరువు పోవడంతోపాటు ఇటు అన్నదాతలూ కష్టాలసాగు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.