‘ట్యాక్సీవాలా’కు అదే పరిస్థితి!

taxiwala movie leaked online

విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు ముందే లీక్‌ అయిన విషయం తెల్సిందే. అయితే సినిమా సక్సెస్‌ అవ్వడంతో లీక్‌ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే తాజాగా అదే విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రంకు సంబంధించిన సీన్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. ఇంకా ఎడిటింగ్‌ కూడా కాన్ని కొన్ని రసెష్‌ సీన్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గూగుల్‌ డ్రైవ్‌ ద్వారా లీక్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ట్యాక్సీవాలా చిత్ర యూనిట్‌ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, లీక్‌ అయిన వీడియోలను డిలీట్‌ చేయించారు.

taxiwala

గూగుల్‌ డ్రైవ్‌లో ఈ వీడియోలను షేర్‌ చేస్తున్న వారిని గుర్తించినట్లుగా పోలీసులు చెప్పుకొచ్చారు. త్వరలోనే వారిని ట్రేస్‌ చేసి అరెస్ట్‌ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ట్యాక్సీవాలా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఈ సమయంలోనే సినిమా ఇలా లీక్‌ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు షాక్‌ అవుతున్నారు. గీతగోవిందంతో పాటు ఆమద్య అరవింద సమేత చిత్రంకు సంబంధించిన సీన్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. మొత్తానికి ఈ లీక్‌లు చిత్ర నిర్మాతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఏం చేసినా, ఎలా చేసినా కూడా సినిమాల లీక్‌ అనేది జరుగుతూనే ఉంది. ట్యాక్సీవాలా చిత్రం లీక్‌ అవ్వడంతో చిత్ర ఫలితంపై ప్రభావం పడుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు మాత్రం గీత గోవిందం సక్సెస్‌ సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందేమో అని పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Taxiwala movie,