స్పీడ్ పెంచిన టీటీడీపీ….పొత్తుల మీద క్లారిటీ …!

Tdp Clarity On Alliance

తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు రావడంతో పొత్తుల మీద టీడీపీ-కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి.తెలంగాణలో పొత్తులపై తెలంగాణా రాష్ట్ర నేతలకే సీఎం చంద్రబాబు అధికారాలిచ్చిన విషయం తెలిసిందే. పొత్తుల నిర్ణయం తెలంగాణ నేతలదేనని ఎన్నికల ప్రచారం కూడా తాను చేయబోనని బాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తెలంగాణలో పార్టీ బాగు కోసం ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోరాడండి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌తో వెళ్లాల్సి వచ్చినా నేతలే ప్రచారం చేసుకోవాలని సూచించారు.

tdp-and-congress

దీంతో టీటీడీపీ స్పీడ్ పెంచి కాంగ్రెస్‌తో పొత్తు కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తుల చర్చల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడు రమణ ఫోన్ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇప్పుడు పొత్తులపై చర్చలకు సంప్రదింపుల కమిటీ రంగంలోకి దిగింది. ఈరోజు సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ తో టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా రేపు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. దేవేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎలక్షన్ పబ్లిసిటీ కమిటీ ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రానికి ఈ పొత్తుల విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

   TDP leaders with the head of Kodandaram