టీడీపీతో కాంగ్రెస్ పొత్తు…అని ఎవరు చెప్పారు నాయానా…?

Rahul Gandhi AP CM Naidu To Campaign Jointly In Telangana

భాజపాయేతర కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే అదేమీ పొత్తు అని చెప్పలేదు బీజేపీని మట్టి కరిపించ డానికి కేవలం అన్ని ప్రాంతీయ పర్త్యాలని జాతీయ కూటమిలో చేరుస్తున్నామని ప్రకటించారు. అయితే చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందని భావించిన ఆ పార్టీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తును వ్యతిరేకిస్తూ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా, ఆ బాటలోనే మరో సీనియర్ నేత సి.రామచంద్రయ్య నడుస్తున్నారు.

C-Ramachandraiah

చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తూ సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తుపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై ఎంత చెప్పినా తక్కువే అని, ఈ పాపాలను తమెలా మోయాలని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఎలా చెప్పాలని నిలదీశారు. పొత్తుతో రాజకీయంగా ఫలితం ఉంటుందో లేదో తెలియదని కానీ తాము నైతికంగా పతనమయ్యామన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతో పొత్తా అని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్న‌ట్టుగా ముందుగా త‌మ‌తో రాహుల్ గాంధీ చ‌ర్చించ‌లేద‌ని అంటున్నారు రామ‌చంద్ర‌య్య‌. చంద్ర‌బాబుతో పొత్తు విష‌య‌మై రాహుల్ తీసుకున్న నిర్ణ‌యం పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవ‌డ‌మేంట‌ని కూడా రామ‌చంద్ర‌య్య ప్ర‌శ్నించారు. ఏపీ కాంగ్రెస్ కి చెందిన మ‌రికొంత‌మంది సీనియ‌ర్ నేత‌ల నుంచి కూడా దాదాపు ఇలాంటి స్పంద‌నే వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Congress-Senior-Leader-C-Ra

ఎందుకంటే, ఎప్ప‌ట్నుంచో టీడీపీని వ్య‌తిరేకిస్తున్న‌వారు ఉన్నారు క‌దా. అయితే ఇక్కడ వీరికి అర్ధం కావాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మిలో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీలు క‌లుస్తున్నాయ‌న్ని కొన్ని నెల‌ల కింద‌టే ఫిక్స్ అయిపోయింది. ఆ ప్ర‌క్రియ ఓప‌క్క జ‌రుగుతున్న‌ప్పుడు… టీడీపీతో పొత్తు గురించి త‌మ‌కు తెలీద‌ని అంటే ఎలా..? తెలంగాణ‌లో కాంగ్రెస్ రాజ‌కీయ అవ‌స‌రాలు వేరు కాబ‌ట్టి, దాన్ని ఆ రాష్ట్రానికి ప‌రిమిత‌మైన వ్య‌వ‌హారంగా చూడాల‌ని తెలంగాణా కాంగ్రెస్ నేత‌లే కొంత‌మంది వ్యాఖ్యానించారు.

tdp-congress

అప్పుడు కూడా టీడీపీతో పొత్తు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి ఏమైనా వ్యక్తిగత ఇబ్బందులు లాంటివి ఉంటే అప్పుడే బయట పెట్టాల్సింది. అలాగే టీడీపీ నుంచిగానీ, కాంగ్రెస్ నుంచిగానీ ఇంకా స్ప‌ష్ట‌త లేని విష‌యం ఏంటంటే ఈ రెండు పార్టీలూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో క‌లిసి ప‌నిచేస్తాయా అని. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాంటి పోత్తూ ఉండ‌ద‌నీ, కేవ‌లం కేంద్రంలో మాత్ర‌మే కాంగ్రెస్ కి టీడీపీ స‌పోర్ట్ అని టీడీపీ నేత‌లు అంటున్నారు. అది కూడా వినని వినించుకొని కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎర్ర తువ్వాళ్ళు వేసుకునేందుకు గామోసు తెగ ఫైర్ అవుతూ బాటకు వచ్చేస్తున్నారు రాహుల్ మీద.

cm-chandrababu-naidu