జగన్ తిట్లు రొటీన్ కాదు…కౌంటర్ కూడా అలాగే.

TDP Finance minister yanamala Ramakrishna Firing comments On Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం చంద్రబాబుకి ఉరి వేసినా తప్పులేదనడం ద్వారా వైసీపీ అధినేత జగన్ మరో వివాదానికి తెర లేపాడు. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందట చంద్రబాబుని కాల్చి చంపినా తప్పులేదన్నాడు. దీంతో ఎంత రచ్చ జరిగిందో అంతా చూసారు. ఎన్నికల సంఘం కూడా తాఖీదులు ఇచ్చింది. దానికి వివరణ ఇచ్చిన వెంటనే జగన్ ఇలా మాట్లాడ్డం చూస్తుంటే ఇది అనుకోకుండా జరిగింది అనుకోలేం.

ఓ వ్యూహం ప్రకారమే జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. నంద్యాల ఉపఎన్నికలో హీట్ పెరిగితేనే తనకు లాభమని కొన్ని సర్వేలు చెబుతున్న దానికి అనుగుణంగా జగన్ ఈ తిట్లు, దూషణలకు పదును పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ దూకుడుని అడ్డుకోడానికి టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు.
చంద్రబాబు మీద జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. ఆయన ఏమన్నారో చూడండి.ఇక ఆర్ధికమంత్రి యనమల కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయన జగన్ ని ఎలా టార్గెట్ చేశారంటే .

వైఎస్ జగన్మోహన రెడ్డిపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం:
  • జన్మలో ముఖ్యమంత్రి పదవి దక్కదనే అక్కసుతో జగన్మోహన రెడ్డి ఉన్మాదిగా మారారు: యనమల
  • రోజురోజుకు జగన్ ఉన్మాదం తారాస్థాయికి చేరుతోంది: యనమల
  • పదవి దక్కలేదనే అక్కసుతో రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు: యనమల
  • ప్రజాస్వామ్య విలువలకు,రాజ్యాంగ ఔన్నత్యానికి జగన్ కళంకం తెస్తున్నారు: యనమల
  • ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని కన్సల్టెంట్ చెప్పినట్లున్నారు: యనమల
  • ఎన్ని తిట్లు తిడితే అన్నివేల ఓట్లు పోతాయని తెలుసుకోవాలి: యనమల
  • ఉన్మాదంగా వ్యవహరిస్తున్న జగన్మోహన రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా తగడు:యనమల
  • ఇంత ఉన్మాదం,విపరీత ధోరణి ఉన్న ఏనాయకుడినీ ఇంతవరకుచూడలేదు: యనమల
  • ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పులేదని తాను అన్నది నిజమేనని జగన్ స్వయానా ఒప్పుకున్నాడు
    ఇంతకన్నా సాక్ష్యం ఎన్నికల సంఘానికి ఇంకేమి కావాలి: యనమల సూటిప్రశ్న
  • ఎన్నికల సంఘం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి: యనమల ధ్వజం
  • ప్రజాస్వామ్యంలో ఇటువంటి పార్టీకి, నాయకుడికి చోటు లేదు: యనమల
  • మావోయిస్టులు, తీవ్రవాదులు,ఉగ్రవాదులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
    రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు గతంలో యూపి నేతను 20రోజులు జైల్లో పెట్టారు: యనమల
  • భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్మాద నాయకులకు చోటులేదు:యనమల రామకృష్ణుడు
టిడిపి సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని వ్యాఖ్యలు :
  • జగన్ ఓ ఉన్మాది లా వ్యవహరిస్తున్నాడు.
  • జగన్ ది సైకో మనస్తత్వం .
  • మానవత విలువలు లేని ఓ క్రిమినల్ జగన్.
  • ప్రపంచంలో అత్యంత కిరాతకులలో జగన్ ఒకరు.
  • తన లాగే అందరు అరాచకాలు – అక్రమాలు చేస్తారని జగన్ బావిస్తున్నాడు.
  • జగన్ కు అరుదైన మానసిక రోగం ఉంది.
  • అధికారం ఎప్పటికీ రాదని తేలడంతో మానసిక రోగం బాగా ముదిరింది.
  • భూమి మీద ఉన్న వైద్యులు ఎవ్వరూ జగన్ రోగానికి మందు కనిపెట్టలేదు.
  • జగన్ రోగానికి దేవుడే త్వరలో సరైన మందు ఇస్తాడు.
  • జగన్ లాంటి నేతలు ఎందరో కాలగర్బం లో కలిపోయారు.
  • జగన్ కంటే అరచకవాదులు వైసిపి ఎమ్మెల్యే .
  • ఉన్మాదిలా వ్యవహరిస్తే భగవంతుడు ఎలా శిక్షిస్తాడో మీ తండ్రి, తాతలు చరిత్ర చూసుకో.
  • చంద్రబాబు ఎంట్రుక కూడా జగన్ పీకలేడు.
  • వైఎస్ కొడుకు కాకపోతే జగన్ బతుకు గుడిసె బతుకే.
  • సాక్షి పత్రిక , ఛానల్ ఎవరి దో జగన్ చెప్పాలి.

మరిన్ని వార్తలు:

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రైతుబిడ్డ‌

ప్ర‌చార‌మూ…ప్ర‌లోభ‌మూ

బాధితురాలు నా కూతురు లాంటిదిః అయితే తండ్రిలానే ప్ర‌వ‌ర్తించండి