వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేసిన అధినేత చంద్రబాబు వారికి ఎన్నికల కోసం సిద్ధం కావాలని సూచించారు. నిన్న కడప, రాజంపేట పార్లమెంట్ స్ధానాల పరిధిలో అభ్యర్ధులు ఖరారు కావడంతో దాదాపుగా తొలి విడత జాబితాపై క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇప్పటికే కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 70కి పైగా పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపుగా గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ అభ్యర్ధులే ఉన్నారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ ఈసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా తాజాగా ఎమ్మెల్సీ పదవి వదులుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి సర్వేపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. కడప జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబంతో ఒప్పందంలో భాగంగా జమ్మలమడుగుకు బదులుగా కడప ఎంపీ స్ధానంలో పోటీ చేయనున్నారు. తొలి జాబితాగా చెబుతున్న 74 మంది అభ్యర్ధుల లిస్టు ఇదే !
అసెంబ్లీ అభ్యర్థులు :
కడప – మహ్మద్ అష్రాఫ్
రాయచోటి – రమేష్ రెడ్డి
రాజం పేట – చెంగల్రాయుడు
రైల్వే కోడూరు – నరసింహ ప్రసాద్
బద్వేల్ – లాజరస్
మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్
జమ్మలమడుగు – రామసుబ్బారెడ్డి
పులివెందుల – సతీష్ రెడ్డి
కమలాపురం – వీర శివారెడ్డి
తాడిపత్రి – జేసీ ప్రభాకర్ రెడ్డి
రాప్తాడు -పరిటాల సునీత
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
పత్తికొండ – కేఈ కృష్ణమూర్తి
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్
ఆళ్లగడ్డ – అఖిల ప్రియ
నంద్యాల – బ్రహ్మానంద రెడ్డి
ఆదోని – మీనాక్షి నాయుడు
కుప్పం- నారా చంద్రబాబు నాయుడు
పలమనేరు – అమర్నాథ్ రెడ్డి
పుంగనూరు – అనూష రెడ్డి
నగరి – గాలి భానుప్రకాష్
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
నెల్లూరు సిటీ- పి నారాయణ
నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్ రెడ్డి
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఆత్మకూరు – బొల్లినేని రామారావు
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు – దామచర్ల జనార్దన్
దర్శి -శిద్దా రాఘవరావు
తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్
వేమూరు – నక్క ఆనంద్ బాబు
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
వినుకొండ – జి వి ఆంజనేయులు
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పెడన – కాగిత వెంకట్రావు
విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు
గన్నవరం – వల్లభనేని వంశీ
పెనమాలూరు – బోడె ప్రసాద్
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
ఏలూరు – బడేటి బుజ్జి
గోపాల పురం – మద్దిపాటి వెంకట రాజు
నరసాపురం- కొత్తపల్లి సుబ్బారాయుడు
తణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – శివరామరాజు
ఆచంట – పితాని సత్యనారాయణ
జగ్గంపేట – జ్యోతుల నెహ్రు
కొత్తపేట -బండారు సత్యనందం రావు
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు
మండపేట – వేగుళ్ల జోగేశ్వర రావు
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
రాజోలు – బత్తిన రాము
నర్సీ పట్నం – అయ్యన్నపాత్రుడు
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ
భీమిలి – గంటా శ్రీనివాస్
అరకు – కిడారి శ్రవణ్ కుమార్
మాడుగుల – రామానాయుడు
పెందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి
బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు
ఎస్ కోట – కోళ్ల లలిత కుమారి
రాజాం – కొండ్రు మురళి
ఎచ్చెర్ల – కళా వెంకట్రావు
టెక్కలి – అచ్చెన్నాయుడు
పలాస – గౌతు శిరీష
పాతపట్నం- కలమణ వెంకటరమణ
ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
శ్రీకాకుళం – గుండ లక్ష్మీదేవి