Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాకినాడ కార్పొరేషన్ తుది ఫలితాలు వెలువడ్డాయి. 48 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి 35 స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ 32 స్థానల్లో , బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. ప్రతిపక్ష వైసీపీకి పదిస్థానాలు దక్కాయి. మరో మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ కు కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయింది. సగం డివిజన్లలో పోటీచేసిన కాంగ్రెస్ కు ఎక్కడా విజయం లభించకపోగా, చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. అటు 30 ఏళ్ల తరువాత కాకినాడలో చరిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ సంబరాలు చేసుకుంటోంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు నేతలకు మిఠాయిలు పంచుతూ ఆనందం పంచుకున్నారు. కాకినాడలో టీడీపి విజయానికి రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని మంత్రులు అన్నారు. మూడేళ్లగా నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకెళ్లటానికి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని గమనిస్తున్న ప్రజలు అన్ని ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తున్నారని చెప్పారు. నంద్యాల, కాకినాడ ఓటర్ల తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని, రానున్న రోజుల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.
మరిన్ని వార్తలు: