Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం మీద పార్లమెంట్ వేదికగా పోరాడాలని టీడీపీ ఎంపీలకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు పార్టీ ఎంపీలతో సమావేశం అయిన సందర్భంగా కఠిన నిర్ణయం తీసుకుంటారని భావించినా ముందుగా పోరాటం చేసి అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే కఠిన నిర్ణయానికి పూనుకోవాలని బాబు ఆలోచనగా వుంది. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు కేంద్రం మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షం అన్న కనీస గౌరవం లేకుండా ప్రధాని మోడీ చూస్తున్నారని, ఇక బీజేపీ తో పొత్తు, రాజకీయ బంధం అనవసరం అని ఎంపీలు వాదించారు. అందరి అభిప్రాయాలు విన్న చంద్రబాబు ముందుగా పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద పోరాటం చేద్దామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తీవ్ర నిర్ణయాల గురించి ఆలోచన చేద్దామని సూచించారు.