ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ బాబాయ్ మాజీ మంత్రి వివేకా హత్య రాజకీయాలలో సంచలనం రేపింది. అప్పట్లో ఆ హత్యను వైసీపీనే చేయించిందంటూ టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. అయితే వివేక హత్యకు గురై చాలా రోజులు అవుతున్న పోలీసులు ఇప్పటికి ఆ హత్య కేసును చేధించలేకపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పచెప్పింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది.
అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్ట్‌లో పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ సీబీఐ విచారణ కోరారని, అయితే ప్రస్తుతం సిట్ విచారణ సక్రమంగా జరుగుతుందని ప్రభుత్వ తరపు ఏజీ కోర్ట్‌కు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.