తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. ఇకపోతే ఇటీవల ఆంద్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సన్న బియ్యం విషయంలో సాక్షి పత్రిక పొరపాటుగా తప్పుడు వార్తలను రాసిందని సాక్ష్యాత్తు సీఎం జగన్ గారే వెల్లడించారు. అయితే ఈమేరకు నారా లోకేష్, సీఎం జగన్ మీ ఉద్దేశించి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా తన సొంత పత్రిక దొంగ పత్రికని, అందులో రాసేవన్నీ అసత్యాలే అని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని టీడీపీ నేత నారా లోకేశ్ వాఖ్యానించారు.
ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారని, వారికోసం కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారని, అంతేకాకుండా రాష్ట్రంలోని బీసీలకు సొంతంగా ఉపాధిని కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆదరణ పథకంలో, టీడీపీ ప్రభుత్వం చాలా దారుణంగా నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారని ఆనాడు జగన్ ప్రచారం చేశారని వెల్లడించారు. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా గత టీడీపీ పాలనలో బీసీలకు కేటాయించిన రూ. 36 వేల కోట్లలో రూ. 28.8 వేల కోట్లను ఖర్చు చేశారని వైసీపీ ఒప్పుకుందని స్పష్టం చేశారు. కాగా ఆనాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పై తప్పుడు ప్రచారాలు చేసినందుకు గాను బహిరంగ క్షమాణాలు చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. ఇకముందు ఇలాంటి ఆరోపణలు చేసేముందు ఆలోచించి మాట్లాడాలను నారా లోకేష్ హితవు పలికారు…