Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు జనసేన పార్టీలో చేరుతున్న తొలి రాజకీయ నాయకుడిగా నిలవబోతున్నారు. ఇప్పటివరకు పవన్ పార్టీలో అందరూ కొత్తవాళ్లే చేరారు. కానీ తొలిసారి రాంబాబుకు మాత్రం టికెట్ హామీ కూడా లభించడంతో.. ఆయన జనసేనలోకి వెళ్లిపోయారు. ఈయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి అక్కడ్నుంచి జనసేనకు వెళ్లడం వింతగానే ఉంది.
గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం, అక్కడే ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం రాంబాబుకు ఉంది. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో.. ఆయన కూడా కాంగ్రెస్ మనిషైపోయారు. తర్వతా టీడీపీలోకి వచ్చినా.. 2014 ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలిపడ్డారు. మరి ఈసారైనా జనసేన తరపున బరిలోకి దిగి గెలుస్తారా అనేది సందేహమే.
వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డి టీడీపీలోకి రావడంతో.. రాంబాబు ముందు జాగ్రత్తగా జనసేనకు వెళ్లిపోయారు. కానీ జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఎంత సీన్ ఉంటుది, రాంబాబు వేసింది తప్పుటడుగా అనేది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాకే తేలుతుంది. పవన్ అయితే ఇంకా బాబు చాటు రాజకీయమే చేస్తున్నాడు. అలాంటప్పుడు రాంబాబు ఏం సాధిస్తారనేది అయోమయంగా మారింది.
మరిన్ని వార్తలు: