అమరావతి ఫై వైసీపీ మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, డొక్కా మాణిక్య వరప్రసాదులు తీవ్రంగా ఖండించారు. రాజధానిని మార్చాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. సెల్ఫ్ ఫైనాన్స్ గా వున్న అమరావతి అభివృద్ధికి ఎందుకు అడ్డం పడ్డారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ మేనిఫెస్టో లో జగన్ అమరావతిని కొనసాగిస్తామని చెప్పి ఇపుడు మాట తప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులకు ప్లాట్లు ఇవ్వగా ఇంకా ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల స్థలం ఉంటుందని అన్నారు. అయితే చంద్రబాబు హయం లో అమరావతి కోసం 9597 కోట్ల రూపాయల్ని ఖర్చు పెడితే, 5800 కోట్ల రూపాయలుగా అబద్దం చెబుతున్నారని దుయ్యబట్టారు. రాజదాని నిర్మాణానికి అంబటి రాంబాబు 3, 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటారు, బొత్స లక్ష 15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంటారు. మీ అబద్దాలకి అంతే లేదా చరిత్ర మిమ్మల్ని క్షమించదు అంటూ టీడీపీ నేతలు త్క్ప్ నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.