Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చేంతవరకు మౌనం పాటించాలని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్ లో చేరిక పాపాన్ని మీడియా ఖాతాలో వేసి సైలెంట్ అయిపోయారు. ఓ మాటలో చెప్పాలంటే రేవంత్ సర్దుకుపోవడానికి రెడీ అయిపోయారు. పార్టీ మారతారో లేదో గానీ చంద్రబాబు వచ్చేదాకా టీడీపీ ని ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. అయితే ఆయనకి ఊహించని షాక్ ఇచ్చాడు పాత మిత్రుడు పయ్యావుల కేశవ్.
రేవంత్ మీద నోరెత్తడానికి అందరూ భయపడుతున్నా కేశవ్ మాత్రం కెలుకుతున్నాడు. ఆషామాషీ ఆరోపణలు కూడా చేయలేదు. ఏకంగా రేవంత్ , కెసిఆర్ కుమార్తె కవితతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని కేశవ్ ఆరోపించారు. అంతటితో ఆపలేదు కేశవ్. వైసీపీ అధినేత జగన్ తో కూడా రేవంత్ కుమ్మక్కు అయ్యాడని కేశవ్ అన్నారు. ఇక పోతే తాజా రేవంత్ ఎపిసోడ్ కి కారణం అయిన కాంగ్రెస్ తో చర్చల వెనుక రహస్యం కూడా తమకి తెలుసని కేశవ్ బాంబు పేల్చారు. రేవంత్ ఎపిసోడ్ ఇక క్లోజ్ అనుకున్న తరుణంలో కేశవ్ కెలుకుడు టీడీపీ వర్గాల్ని కూడా షాక్ లో పడేసింది.