పార్లమెంట్ లో ఎన్టీఆర్ హంగామా.

TDP MP Siva Prasad Reddy in NTR Getup

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అమలు కోసం పార్లమెంట్ వేదికగా ఆందోళన సాగుతున్న వేళ లో ఇప్పుడు గనుక ఎన్టీఆర్ ఉంటేనా అని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. అంతలోనే అక్కడ ప్రత్యక్షం అయ్యారు ఎన్టీఆర్. నిజంగా ఎన్టీఆర్ కాదులెండి. ఆ వేషంలో వున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్. అక్కడికి వచ్చారు. విభజన చట్టం అమలుకు డిమాండ్ చేస్తున్న తరుణంలో చిత్రవిచిత్ర వేషధారణలతో పార్లమెంట్ కి వస్తున్న శివప్రసాద్ ఈరోజు ఏకంగా ఎన్టీఆర్ పాత్రధారిగా వచ్చారు. ఎన్టీఆర్ స్టైల్ లో ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయం గురించి చెప్పారు.

పార్లమెంట్ లోపల, వెలుపల టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలో శివప్రసాద్ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ఎన్టీఆర్ గెట్ అప్ లో వున్న శివప్రసాద్ ని ఆసక్తిగా చూడడం కనిపించింది.