Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ లో ఎంత మంది నేతలు వున్నా చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ స్టైల్ వేరు. ప్రజా సమస్యలపై భిన్న వేషధారణల్లో అటు చట్ట సభలో, ఇటు ప్రజాక్షేత్రంలో శివ ప్రసాద్ చేసే సందడి మాత్రమే అందరికీ గుర్తు ఉంటుంది. అంతకు మించి ఆయన పెద్ద డాక్టర్ . సీఎం చంద్రబాబుకు బాగా సన్నిహితుడు కూడా. అప్పట్లో శివ ప్రసాద్ కి ఎమ్మెల్యే టికెట్ తో పాటు క్యాబినెట్ లో స్థానం ఇచ్చి మరీ ప్రోత్సహించారు బాబు. తర్వాత ఎంపీ గా గెలిపించి చేయి అందించారు. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన కొద్ది కాలానికే కొన్ని వ్యక్తిగత డిమాండ్స్ తీరలేదన్న కోపంతో పార్టీ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగారు. కొన్ని సభలు , వేదికల మీదే పార్టీ కి నష్టం చేసే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నించిన నేతల మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయం బాబు చెవిన పడడంతో ఆయన కూడా శివ ప్రసాద్ తో మాట్లాడినా ఎంపీ గారి ధోరణి మారలేదు సరికదా వైసీపీ కి వెళుతున్నట్టు పార్టీని బెదిరించే సంకేతాలు ఇచ్చారు.
నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికలతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు అంచనా వేసుకున్న శివప్రసాద్ కు టీడీపీ తో పోల్చుకుంటే వైసీపీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అర్ధం అయ్యిందట. అందుకే టీడీపీ హైకమాండ్ తో అంటే చంద్రబాబు గుడ్ లుక్స్ లో పడేందుకు ఆయన నానా పాట్లు పడుతున్నారంట. అయితే బాబు ఎప్పటికప్పుడు దూరంగా వుంటూ వస్తున్నారట. అయ్యగారు చెప్పే హరికథలు, బుర్ర కధలు వినడానికి ఆసక్తి చూపడం లేదట. దీంతో సీన్ అర్ధం చేసుకున్న శివప్రసాద్ బాబు సన్నిహితులతో సారీ లు చెబుతూ ఆయన కోపం తగ్గేలా చూడమని ప్రాధేయపడుతున్నారంట. ఈ ఇద్దరు మిత్రుల కథలో ఇది ప్రీ క్లైమాక్. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.