Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వంగవీటి రంగా తనయుడిగా దక్షిణ కోస్తా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన స్థాయిలో ఉండాల్సిన రాధాకృష్ణ ఇప్పుడు రాజకీయ కూడలిలో నిలుచులున్నారు. పేరుకు వైసీపీ లో ఉన్నప్పటికీ అక్కడ తన సొంత స్థానంలో టికెట్ కి గ్యారంటీ లేని పరిస్థితి. ఇక టీడీపీలోకి వెళదామంటే రంగా రాజకీయ వ్యతిరేకులతో కలిసినట్టు చెడ్డ పేరు వస్తుందని భయం. ఏ నిర్ణయం తీసుకోకపోతే రాజకీయ భవిష్యత్ వుండబోదన్న ఆందోళన. వీటన్నిటికీ రాజకీయంగా ఆయన తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలే కారణం. దీంతో వంగవీటి రాధా రాజకీయ అస్తిత్వమే ప్రశ్నగా మిగిలింది.
వంగవీటి రాధని పార్టీలోకి తీసుకొస్తే కాపుల మద్దతు సంపూర్ణంగా లభిస్తుందని భావిస్తున్న టీడీపీ అందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఓ స్థాయిలో రాధతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ కి ఓకే చెప్పకపోయినా ఎమ్మెల్సీ ఇస్తామన్న సంకేతం ఇచ్చారు. అయితే రాధా ఓకే అనకపోవడంతో ఇప్పుడు టీడీపీ నుంచి తాజాగా సూపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
రాధా ఒప్పుకుంటే మచిలీపట్టణం లోక్ సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. అక్కడ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య కారణాలు వల్ల ఈసారి పోటీకి దూరం గా వుండే అవకాశం ఉందట. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరక్కపోయినా కాపులకు అది సేఫ్ అని టీడీపీ ఆలోచన . అందులోను రాధా పోటీ చేస్తే ఇక తిరుగుండదని తెలుగుదేశం అభిప్రాయం అట. ఈ ఆఫర్ కి వంగవీటి రాధా ఏమంటాడో మరి ?