ఆయనో నిత్య పెళ్ళికొడుకు…కళ్యాణ్ అంటే పెళ్లి అనుకుంటున్నాడు

TDP Rajya Sabha MP CM Ramesh serious comments on pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌వి పిచ్చి ప్రేలాపనలు అంటూ విమర్శించారు. కడప నవనిర్మాణ దీక్షలో మాట్లాడిన సీఎం రమేష్…. పవన్‌ కల్యాణ్ టీడీపీపై ఆరోపణలు చేస్తూ జనానికి నవ్వులు పూయిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాకే పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందని పవన్. కల్యాణ్ జీలకర్రలో కర్రలు లేనట్టుగా పవన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అవి మానుకోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ పేరులోనే కల్యాణ్ ఉందని… అంటే దాని అర్థం ఆయన నిత్య పెళ్లి కొడుకు అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. బీజేపీతో వైసీపీ, జనసేన లోపాయికారి ఒప్పందం చేసుకుని పనిచేస్తున్నాయని సీఎం రమేష్ ఆరోపించారు. కానీ ప్రజల ఆగ్రహం ముందు రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు మసికాక తప్పదని హెచ్చరించారు.