ఇదివరకి టీ20 ప్రపంచకప్ ఇంకా వన్డే ప్రపంచకప్‌లలో భారత్ జట్టు గెలిపించడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. వెస్టిండీస్ పర్యటనలో వన్డే ఆడుతూ గాయపడ్డ యువరాజ్ సింగ్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించాడు. మళ్లీ ఆల్‌రౌండర్ ఫిట్నెస్ మెరుగుపరుచుకున్న సెలక్టర్లు యువీకి అవకాశమివ్వలేదు.
ఇటీవల రిటైర్మెంట్ తెలిపిన యువరాజ్ సింగ్ రెండేళ్లు భారత్ జట్టులో చోటు కొరకి వేచిచూశాడు. తనని టీమిండియా మేనేజ్మెంట్, సెలక్టర్లు పక్కన పెట్టి అవకాశం ఇవ్వని తీరుని వెల్లడించాడు. గాయం తర్వాత మళ్లీ వేటు వేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ కారణాలు తెలిపి తనకి అవకాశం లేకుండా చేశారు అని చెప్పారు . రిటైర్మెంట్కి ముందు మాట్లాడిన యువరాజ్ యో-యో టెస్టు కోసం 36 ఏళ్ల వయసులోనూ కష్టపడి పాస్ అయిన కుట్రపన్ని అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
యువరాజ్ సింగ్‌కి చివరలో వీడ్కోలు మ్యాచ్ అవకాశం కూడా ఇవ్వలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. గంభీర్ మాట్లాడుతూ కనీసం యువరాజ్ ధరించిన నెం.12 జెర్సీకైనా రిటైర్మెంట్ ప్రకటించి యువరాజ్ సింగ్‌ని గౌరవించాలని తన అభిప్రాయాన్ని తెలియచేసారు