మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. టెక్‌సాక్షం పేరుతో 62,000 మందికి ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది.
నిపుణులైన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్‌షిప్స్, చిన్న వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం శిక్షణ ఇస్తారు.