ఎమర్జెన్సీ పాస్‌లను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఎమర్జెన్సీ పాస్‌లను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మే నెల 7 వరకు పొడగించామని అధికారికంగా వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి లాక్ డౌన్ ని కొన్నింటికి సడలింపులు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల 7 వరకు లాక్ డౌన్ కఠినంగా కొనసాగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఇలాంటి తరుణంలో హైదరాబాద్ పోలీసులు మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ఎవరికైనా అత్యవసరమైన పనుల నిమిత్తం వెళ్లాలనుకున్న వారికి అనుమతులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ- పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి, తమ వెబ్‌సైట్‌లో ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ. ఈ మేరకు పోలీస్ కమీషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ పాస్‌లను రివ్యూ చేయడానికి ప్రత్యేక టీంను సిద్ధం చేశామని, ఎవరైనా ఆ పాస్ ని దుర్వినియోగం చేసిన ఎడల వారిపై ఖఠినమైన చర్యలని తీసుకుంటామని పలు హెచ్చరికలు జారీ చేశారు.