పేద ప్రజల కోసం సీఎం జగన్ కీలక్ నిర్ణయం

పేద ప్రజల కోసం సీఎం జగన్ కీలక్ నిర్ణయం

ఏపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో కీలక్ నిర్ణయం తీసుకుంది. అయితే నవంబర్‌ నుంచి నిలిచిపోయిన, పరిష్కారం కాని క్లెయిములను వెంటనే లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ కూలీప‌నులు చేసేవారు, వేత‌నాలు త‌క్క‌వు వచ్చిన వారు ఇలా త‌దిత‌రులు సహజమరణం లేదా ప్రమాదవశాత్తూ ఎవరైనా చ‌నిపోతే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు బీమాలు అందించేవి.

అయితే బీమా, ఎల్‌ఐసీ మంజూరు చేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను ఇవ్వాల‌ని సీఎం నిర్ణయించారు. అయితే 2019 నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు నిలిచిపోగా ఈ అంశంపై స్పందించాల‌ని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించి ఎల్‌ఐసీకి లేఖ రాశారు. అయినా సరే ఇప్పటివరకు క్లెయిమ్‌లను మంజూరు చేయలేదు. అయితే బీమా, ఎల్‌ఐసీ మంజూరు చేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను మాత్రం ఇవ్వాల‌ని సీఎం సూచించడంతో ఈ మేరకు చెల్లింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.