కేసీఆర్ కంటికి సమస్యేంటి..?

Telangana Cm KCR Going To Delhi For Eye Operation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Telangana Cm KCR Going To Delhi For Eye Operation

కేసీఆర్ కు చుక్కడాలు ఉన్నాయని ఆయన ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. ఇదేం విమర్శించే అంశం కాకపోయినా.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి మండిపడుతున్నారు. చుక్కడాలు ఉంటే కళ్లజోడు పెట్టాలి.. కానీ కేసీఆర్ ఎప్పుడూ కళ్లజోడు వాడినట్లు కనిపించరు. మరి చుక్కడాలేంటని సొంత పార్టీ క్యాడర్ కు కూడా చాలా సందేహాలున్నాయి.

దీంతో కేసీఆర్ మెడికల్ హిస్టరీ చెబుతున్నారు ఆయన సన్నిహితులు. కేసీఆర్ కంటి సమస్య ఇప్పటిది కాదు. ఆయన యూపీఏ-1లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాద సమయంలో కూడా ఆయన నల్ల కళ్లజోడుతోనే కనిపించారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కంటి ఆపరేషన్ పై చర్చ జరుగుతోంది.

కేసీఆర్ కంటిపై ఓ పొర లాగా చుక్కడం వచ్చేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ గత ఢిల్లీ పర్యటనలోనే ఆపరేషన్ పూర్తవ్వాల్సి ఉన్నా.. వైద్యులు బిజీగా ఉండటంతో కుదరదలేదు. కానీ ఈసారి కేసీఆర్ లాంగ్ టూర్ కాబట్టి.. తప్పకుండా ఆపరేషన్ కంప్లీట్ చేసుకునే హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి. ఆపరేషన్ తర్వాత కేసీఆర్ కు ఉన్న కంటి సమస్య కూడా పోతుందని, చుక్కల మందుతో కరిగించడం కుదరకే ఆపరేషన్ కు మొగ్గు చూపారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.

మరిన్ని వార్తాలు: