Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సామాన్యులకు చికెన్ నారాయణ, కమ్యూనిస్టులకు కామ్రేడ్ నారాయణ. పొలిటికల్ పార్టీలకు కామెడీ నారాయణ. ఇదీ సీపీఐ నారాయణ ప్రొఫైల్. పోరాటాల్లో ముందుండే నారాయణ… ఇప్పుడు అనుకోకుండా విశాఖ వెళ్లి గాయపడ్డారు. నిరసన సంగతి దేవుడెరుగు… కాలుకు దెబ్బ తగిలించుకుని ఆస్పత్రి పాలయ్యారు. ఈ వయసులో కూడా నారాయణ తెలిపిన నిరసన చూస్తే అవాక్కవ్వాల్సిందే.
విశాఖలో భూకుంభకోణాలపై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కామ్రేడ్లు కూడా ఆందోళనకు దిగారు. మధురవాడక దగ్గర్లోని 22 ఎకరాల సర్కారీ భూమిని కొందరు కబ్జా చేశారు. పైగా ఫెన్సింగ్ కట్టారు. అది చూసి రెచ్చిపోయిన నారాయణ, ఫెన్సింగ్ ను కాలితో బలంగా తన్నారు. ఆయన దెబ్బకు అది రెండు ముక్కలైంది. కానీ ఆ రెండు ముక్కల మధ్యలో నారాయణ కాలు ఇరుక్కుపోయింది.
తమ నేత బాగా స్ఫూర్తి ఇస్తున్నారని సంబరపడ్డ కార్యకర్తలకు అనుకోని ఘటన షాక్ ఇచ్చింది. వెంటనే ఇరుక్కున్న నారాయణ కాలు బయటకు తీశారు. తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడుతున్న ఆయన్ను దగ్గర్లోని నర్సింగ్ హోంలో చేర్చారు. ఎక్స్ రే తీసి గాయం తీవ్రత ఎంతన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన కోసం వస్తే… కాలు నొప్పి మిగిలిందని నారాయణ ప్రత్యర్థులు ఆయన్ను ఎద్దేవా చేస్తున్నారు.
మరిన్ని వార్తలు
ఏపీలో బ్రాహ్మణ రాజకీయం
రజని పాలిటిక్స్ కి జ్యోతిష్కుడి అడ్డుపుల్ల?
శాశ్వత శత్రువులు మిత్రులయ్యారా..?