తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రెడీ… 39 మంది…!

Telangana Congress Election Schedule List Ready

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధుల తొలి జాబితాను సిద్ధం చేసింది. అందుతున్న సమాచారం మేరకు 119 నియోజకవర్గాలకుగాను 39 నియోజకవర్గాలకు పేర్లను ఎంపిక చేసింది. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఉన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తొలి జాబితాలో 39 అభ్యర్ధుల పేర్లు మాత్రమే ఖరారు చేసింది. మహాకూటమితో సీట్ల సర్దుబాటు అనంతరం తుది జాబితా సిద్ధం చేయనుంది.

congress
కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా :
సురేష్ షెట్కార్ – నారాయణపేట,
రమేష్ రాథోడ్ – ఖానాపూర్,
పొన్నం ప్రభాకర్ – కరీంనగర్,
బలరాం నాయక్ – మహబూబాబాద్,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -మునుగోడు
సబితా ఇంద్రా రెడ్డి – మహేశ్వరం,
కార్తీక్ రెడ్డి (సబితా ఇంద్రారెడ్డి తనయుడు) – రాజేంద్రనగర్,
పొన్నాల లక్ష్మయ్య – జనగామ,
కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్,
సుధీర్ రెడ్డి – ఎల్బీ నగర్,
ప్రతాప్ రెడ్డి – షాద్ నగర్,
షబ్బీర్ అలీ – కామారెడ్డి,
సుదర్శన్ రెడ్డి – బోధన్,
శ్రీధర్ బాబు – మంథని.
రేవంత్ రెడ్డి – కొడంగల్,
గండ్ర వెంకటరమణా రెడ్డి – భూపాలపల్లి,
మహేశ్వర్ రెడ్డి – నిర్మల్,
జీవన్ రెడ్డి – జగిత్యాల,
దొంతి మాధవ రెడ్డి – నర్సంపేట,
గీతా రెడ్డి – జహీరాబాద్,
దామోదర రాజనర్సింహ – ఆందోల్,
జానారెడ్డి – నాగార్జున సాగర్,
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హుజూర్ నగర్,
కొండా సురేఖ – పరకాల,
పద్మావతి (ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి) – కోదాడ,
కోమటిరెడ్డి వెంకట రెడ్డి – నల్గొండ,
సురేష్ షెట్కార్ – నారాయణఖేడ్,
సునితా లక్ష్మారెడ్డి – నర్సాపూర్,
వంశీ చంద్ రెడ్డి – కల్వకుర్తి,
డీకే అరుణ – గద్వాల,
సంపత్ కుమార్ – ఆలంపూర్,
ఆరేపల్లి మోహన్ – మానకొండూరు,
చిన్నారెడ్డి – వనపర్తి,
జగ్గారెడ్డి – సంగారెడ్డి.
మహకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే టీడీపీ 30, కోదండరాం పార్టీ 20, సీపీఐ 11 సీట్లు అడుగుతన్న నేపథ్యంలో సీట్ల సర్దు బాటు అంశం సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సీట్ల సర్దుబాటు చేస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.