తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల దిశగా పావులు కదులుతున్నాయి. ఫామ్ హౌస్ లో ఇదే విషయంపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింగరావులు భేటీ అయ్యారు.
దీనికి ముందు సెక్రటేరియట్ లో అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు ప్రకటన చేస్తారని, త్వరలో మరోసారి కేబినెట్ భేటీ జరుగుతుందనే నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ప్రగతి నివేదన సభలానే.. హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావులకు ఆ బాధ్యతలు అప్పగించారట. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ మరింత ఆసక్తి రేపుతున్నాయి.