కేసీఆర్ కు మరో విషమ పరీక్ష…!

Telangana Debt Up By 9.5% Within A Span Of One Year RBI Report

ముందస్తు ఎన్నికలు వచ్చింది ఏపీకో తెలంగాణాకో అర్ధం కాదు ఎందుకంటే ప్రతీ అంశాన్నీ ఆంధ్రాతో పోల్చి విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తున్నారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆంధ్రాలో రుణ‌మాఫీ అమ‌లుకాలేద‌నీ, విద్యుత్ సరిప‌డా లేద‌నీ, అభివృద్ధి లేదంటూ విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ఒక నివేదిక‌లో తేలిందేంటంటే ధ‌నిక రాష్ట్రంగా ఏర్ప‌డ్డ తెలంగాణ మెల్ల‌గా అప్పుల్లో కూరుకుపోతోంద‌నీ, పేద రాష్ట్రంగా ప్రారంభ‌మైన న‌వ్యాంధ్ర మెల్ల‌గా అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం మొద‌లైనది అని తేల్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ వెలువరించిన తాజా నివేదికలో తెలుగు రాష్ట్రాలపై ఈ ఆసక్తికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై అప్పు 22.2 శాతం పెరిగిందనీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది 12.7 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు, ఆదాయ వ్యయాలపై అధ్యయనం’ పేరుతో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదిక వెలువరించింది. రుణమాఫీలతో పాటు ప్రయివేటు పెట్టుబడుల ప్రయోజనాలను దెబ్బతీసే మితిమీరిన అప్పుల కారణంగా పలు రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ANDHRAPRADESH-TELENGANA

అంతేకాక ఆర్బీఐ లెక్కప్రకారం జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి పెరగడమంటే ఆర్థిక నిర్వహణ అసమర్థంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ దారుణంగా ఉందంటూ తెలంగాణపై కాగ్ వెలువరించిన వార్షిక నివేదికను సైతం ఆర్బీఐ సమర్థించింది. తెలంగాణలో కేవలం ఒక్క ఏడాదిలోనే అభివృద్ధియేతర వ్యయం (పరిపాలనా పరమైన ఖర్చులు) ఇంతలా ఎలా పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో విస్మయం వ్యక్తం చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధియేతర వ్యయం 3.4 శాతంగా ఉండగా ఈ సారి ఇది ఏకంగా 35.2 శాతానికి ఎగబాకడం గమనార్హం. తెచ్చిన అప్పుల్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ఖ‌ర్చు చేస్తే స‌మ‌ర్థించుకోవ‌చ్చు, కానీ అభివృద్ధియేత‌ర వ్య‌యం ఒక్క ఏడాదిలో అంత పెరగడం ఏంట‌ని ఆర్బీఐ స్వ‌యంగా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి చుస్తుంటే కేసీఆర్ కు బహుశా సమాధానం చెప్పే అవకాశం లేదేమో. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్ర‌తీ అంశాన్నీ ఏపీతో పోల్చి, త‌న పాల‌న‌లో అద్భుతాలు సాధించామ‌ని కేసీఆర్ చెప్పుకుంటున్నారు అయితే తాజా నివేదిక‌పై వారికి సమ్మెటపోతూ అని చెప్పక తప్పదు. పోనీ, అదంతా అభివృద్ధి కోసం చేసిన ఖ‌ర్చే అని స‌మ‌ర్థించుకునే ప‌రిస్థితి కూడా లేదు. పాల‌నా ప‌ర‌మైన ఖ‌ర్చులు ఎక్కువ‌య్యాయ‌ని ఆర్బీఐ చెప్పింది. నిజానికి, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్రా ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ రాష్ట్రం అప్పులు గ‌ణ‌నీయంగా పెరిగినా కొంత అర్థం ఉండేది. కానీ, మిగులు రాష్ట్రమైన తెలంగాణ‌లో అప్పుల శాతం పెర‌గ‌డమంటే ఈ విషయాన్నీ మ‌హా కూట‌మికి మంచి స‌మ‌యంలో అందివ‌చ్చిన విమ‌ర్శ‌నాస్త్రం అని చెప్పక తప్పదు. చంద్రబాబు బహుసా ఈ విషయాన్నె ఎక్కువగా ఫోకస్ చేస్తూ కేసీఆర్ ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు.

KCR Fair on Chandrababu