అయ్యో… మెగా హీరోకు హీరోయిన్లు కరువయ్యారా…!

Two Heroines Locked For Sai Dharam Tej

వరుస హిట్లతో దూసుకుపోతూ సుప్రీమ్‌ హీరోగా పేరు సంపాదించుకున్న సాయిధరమ్‌ తేజ్‌కు ప్రస్తుతం బ్యాడ్‌ టైం నడుస్తోంది. వరుస ఫ్లాపులు పడడంతో చేసేది లేక కాస్త విరామం తీసుకుని మంచి కథను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కథను మావయ్య చిరు సారథ్యంలోనే తెరకెక్కేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు కిశోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్నాడు. ‘చిత్ర లహరి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. చిత్ర, లహరి అనగా ఇద్దరు అమ్మాయిలు. కథ అంతా కూడా ఈ ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కీలక పాత్రలైన చిత్ర, లహరిల కోసం యూనిట్‌ చాలామంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఫ్లాపుల పరంపరలో సాగుతున్న సాయిధరమ్‌ తేజ్‌తో నటించడానికి ఏ క్రేజీ భామ కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Sai Dharam Tej Next Movie Title Chitralahari

కీలక పాత్రలైన చిత్ర, లహరి కోసం చిత్ర యూనిట్‌ చాలామంది క్రేజీ భామలను సంప్రదించారట. కానీ తేజు పేరు చెప్పడంతో అంతా డేట్స్‌ లేవు అంటూ కవర్‌ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఒకరి పాత్ర కోసం ‘హలో’ హీరోయిన్‌ ను ఎంపిక చేయగా మరొక పాత్ర కోసం ‘టిక్‌ టిక్‌ టిక్‌’ నివేతా హెతురాజ్‌లను ఎంపిక చేశారు. వాస్తవానికి ఈ ఇద్దరికి తెలుగులో పెద్దగా క్రేజ్‌ ఏమి లేదు. అయినా కూడా చేసేది లేక అందుబాటులో ఉన్న ఈ ఇద్దరినే బుక్‌ చేశారు. సినిమాలో కీలక పాత్ర వీరిదేనంటున్న యూనిట్‌ ఈ ఇద్దరు భామలతో మ్యానేజ్‌ చేయగలరా? అనేది సందేహమే. పాపం… ఈ మెగా హీరోకు క్రేజీ హీరోయిన్లే కరువయ్యారు అని మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Kalyani-Priyadarshan-Niveth