Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాష్ట్ర అవతరణ(ఏర్పాటు) ఒక్కరోజులో ఆకాశంలోంచి ఊడిపడ్డ తరహా ఏమీ కాదు దాదాపు ఆరు దశాబ్దాల పోరాటం… ఆరుగాలాలు అలుపెరగకుండా కొందరు మహానుభావులు పడ్డ ఆరాటం విద్యార్థుల బలిదానం తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగం… ఆత్మగౌరవం పెట్టుబడిగా ఉవ్వెత్తున ఎగసి రణరంగంలోకి దూకి సాదించుకున్న రాష్ట్రము తెలంగాణా. భరతమాత ఒడిలో 29వ బిడ్డగా 2014 జూన్2న అవతరించింది తెలంగాణ రాష్ట్రము. అదే రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించింది కేంద్రం. స్వాతంత్ర్యం రాకముందు హైదరాబాద్ రాష్ట్రంలో భాగమై ఉండే తెలంగాణ ను నిజాం రాజులు పరిపాలించారు.
ఒక పక్క మహారాష్ట్ర, మరోపక్క కర్ణాటక, ఈశాన్యాన ఛత్తీస్ ఘడ్, తూర్పున ఒడిషా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. తెలంగాణ విస్తీర్ణం 1,14, 840చదరపు కిలోమీటర్లు. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 35,286,757. ఆంధ్రప్రదేశ్ జనాభా తో పోలిస్తే ఇది 41.6 శాతం. తెలంగాణ కొత్త రాష్ట్రమగా ఏర్పడే నాటికి మొత్తం పది జిల్లాలు ఉన్నాయి. వాటిని ప్రస్తుత కేసీఆర్ సర్కార్ 31 జిల్లాలుగా చేసింది. 2014 ఫిబ్రవరి 18న 15వ లోక్ సభ తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. రెండ్రోజుల తర్వాత 20న రాజ్యసభలో సైతం బిల్లు ఓకే అయింది. మార్చి 1న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. జూన్ 2వ తేదీని తెలంగాణ అవతరణ దినోత్సవంగా పేర్కొంటూ అనంతరం మార్చి 4న ప్రకటన జారీ చేసింది కేంద్రం. ఇదండీ క్లుప్తంగా తెలంగాణా అవతరణ దినోత్సవ చరిత్ర