కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న కమెడియన్ గుండు హనుమంతురావుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షలు ఆర్థికసాయం ప్రకటించింది. చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 5లక్షలు విడుదల చేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండు హన్మంతురావు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కొంతకాలంగా గుండు హనుమంతురావు కిడ్నీ వ్యాధికి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. అయితే చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఇటీవలే సినీ పెద్దలకు ఈ విషయాన్ని తెలియజేసింది. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.