తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేశారు. ఈ మేరకు హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం ఇది రెండోసారి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
జూన్ 11న జరిగిన పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను జస్టిస్ పి.మాధవీ దేవి అనుమతించారు. హాల్‌టికెట్‌లో అభ్యర్థుల ఫొటో లేకపోవడం, అభ్యర్థుల బయోమెట్రిక్ స్క్రీనింగ్‌కు గురికాకపోవడం వంటి అనేక లోపాలున్నాయని, పరీక్ష నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని పిటిషనర్లు బి ప్రశాంత్‌తో పాటు మరో ఇద్దరు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పి.మాధవీ దేవి ఉత్తర్వులు జారీ చేశారు.