తెలంగాణ కేబినెట్‌ను సీఎం కేసీఆర్ విస్తరించారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, వి.శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేమకూర మల్లారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి వివరాలు ఇవే :
1. నిరంజన్ రెడ్డి – వనపర్తి – ఆర్థిక శాఖ
గత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు.
మొదటిసారి ఎమ్మెల్యే
2. ప్రశాంత్ రెడ్డి – బాల్కొండ – పరిశ్రమలు
2014 లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా పని చేశారు.
3. కొప్పుల ఈశ్వర్ – ధర్మపురి – విద్యాశాఖ
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు.
4. ఎరబెల్లి దయాకర్ రావు – పాలకుర్తి – వ్యవసాయం
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే.
ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
5. జగదీశ్వర్ రెడ్డి – సూర్యాపేట – రోడ్లు భవనాలు
2014లో మొదటిసారి ఎమ్మెల్యే.
గత ప్రభుత్వంలో విద్యుత్, షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశారు.
6. తలసాని శ్రీనివాస్ యాదవ్ – సనత్ నగర్ – పౌర సరఫరాలు
వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే.
మూడుసార్లు మంత్రి.
గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేశారు.
7. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – నిర్మల్ – వైద్య ఆరోగ్య శాఖ
గతంలో రెండుసార్లు ఎంపీ, 4సార్లు ఎమ్మెల్యే.
గత ప్రభుత్వంలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
8. చేమకూర మల్లారెడ్డి – మేడ్చల్ – విద్యుత్ శాఖ
మొదటిసారి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
9. శ్రీనివాస్ గౌడ్ – మహబూబ్ నగర్ – మునిసిపల్, ఎక్సైజ్ శాఖ
2014లో మొదటిసారి ఎమ్మెల్యే, గతంలో ఉద్యోగ సంఘం నాయకునిగా పనిచేశారు.
ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.
10. ఈటల రాజేందర్ – హుజూరాబాద్ – వెల్ఫేర్
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే.
2014 ప్రభుత్వంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పనిచేశారు.
లోక్‌సభ ఎన్నికల తరవాత మిగిలిన 6 ఖాళీల భర్తీకి అవకాశం : రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం అంటే 120 మందిలో సీఎంతో కలిపి 18 మందికి క్యాబినెట్లో చోటు కల్పించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత 10 మందితో కలిపి మంత్రివర్గంలో మొత్తం 12 మంది అయ్యారు. ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. వీటిని లోక్‌సభ ఎన్నికల తరవాత భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీలకు, మహిళలకు క్యాబినెట్లో చోటు కల్పించడం లాంటి సామాజిక సమీకరణాలపై ముఖ్యమంత్రి అప్పుడే దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి చోటు దక్కని మరికొంత మందికి అప్పుడు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.