జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలంగాణ పోలీసులు..

telangana cm revanth reddy
telangana cm revanth reddy

దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనుబరుస్తూ.. తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ పోలీసు శాఖకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచినట్లు ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 తేల్చింది. ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించాయి. ఇందులో తెలంగాణ పోలీసులకు గొప్ప గుర్తింపు దక్కడం వారి కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.