ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ ఎన్నికయ్యారు. తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా గురువారం రోజున ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆమె తొలి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు పొందారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన సంధ్యారెడ్డి 1991లో కర్రి బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఆమెకు వివాహం కాగా భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. 2021లో ఆమె నివాసం ఉండే చోట స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రవాసభారతీయులతో పాటు ఆస్ట్రేలియా వాసులు సైతం సంధ్యారెడ్డి పోటీ చేయాలని కోరారు. స్థానిక లిబరల్ ,లేబర్ పార్టీల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి ఆమె విజయం సాధించారు.
ఈ పురపాలక సంఘానికి ప్రతి సంవత్సరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ అవకాశం తనకు దక్కడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.