ఈసారి నేచురల్ గా బిగ్ బాస్ !

Telugu Big Boss 2 Promo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగులో వ‌చ్చిన బిగ్‌బాస్ షో ప్రేక్షకులని ఎంత‌గా అల‌రించిందో అంద‌రికీ తెలిసిందే. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో షోకు మంచి పాపులారిటీ వ‌చ్చింది. అయితే గ‌తేడాది బిగ్ బాస్ తొలి సీజ‌న్ తెలుగులో ప్రారంభ‌మైనా ఇప్ప‌టి వ‌ర‌కు రెండో సీజ‌న్ గురించి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ త్వ‌ర‌లో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2 ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఇక ఆ షోకు ప్ర‌ముఖ హీరో నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ప్రకటించారు. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 2 షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంద‌ని సమాచారం. ఇందుకు గాను ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్ర‌త్యేకంగా సెట్ వేశార‌ట‌.

ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ల‌కు అధునాత‌న స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్నార‌ట‌. అలాగే ఈ సీజ‌న్‌కు నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కూడా దాదాపుగా అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే నానికి ఈ సీజ‌న్‌కు గాను స్టార్ మా యాజ‌మాన్యం రూ.4 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌ను అందిస్తుంద‌ని తెలిసింది. మ‌రి ఈ సారి పాల్గొనే సెల‌బ్రిటీలు ఎవ‌రో వేచి చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనేందుకు సామాన్యుల‌కు కూడా స్టార్ మా అవ‌కాశం క‌ల్పించింది. అంటే.. సాధార‌ణ పౌరుల‌కు కూడా ఈ సారి బిగ్ బాస్ షోలో పాల్గొని సెల‌బ్రిటీ అయ్యే అవ‌కాశం ఉంద‌న్నమాట‌. ఇక షో ప్రారంభం అయ్యే వ‌ర‌కు అభిమానుల్లో ఉత్కంఠ మాత్రం త‌ప్ప‌దు క‌దా..!